News December 11, 2024

మా నాన్న చేసిన తప్పు అదే: విష్ణు

image

తమను అమితంగా ప్రేమించడమే మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది. అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్‌లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News January 20, 2026

చలికాలం.. పంటలో పురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

image

చలికాలంలో పంటలో పురుగుల ఉద్ధృతిని తగ్గించడానికి ఎకరా పొలానికి 25 నీలిరంగు, 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. దీంతో పురుగులు ఆ అట్టలకు అతుక్కొని చనిపోతాయి. పొలంపై కలుపును తొలగించాలి. తోట చుట్టూ 3-4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటలను వేయాలి. ఇవి బయట నుంచి వచ్చే పురుగుల నుంచి పంటను కాపాడతాయి. పంట పూతను కాపాడటానికి పూలపై వేపనూనే స్ప్రే చేయాలి. ఇవి చేదుగా ఉండటం వల్ల పురుగులు పువ్వుల జోలికి రావు.

News January 20, 2026

నేడు దావోస్‌లో CM చంద్రబాబు కీలక భేటీలు

image

రెండోరోజు దావోస్‌లో CM చంద్రబాబు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. CII బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై మాట్లాడతారు. అనంతరం ఇండియా లాంజ్ ప్రారంభ కార్యక్రమంలో ఇన్వెస్టర్స్‌తో సమావేశమవుతారు. తర్వాత IBM CEO అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ CEO థామస్‌ను కలుస్తారు. ఈవినింగ్ JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, JSW సిమెంట్స్, పెయింట్స్ సంస్థల MD పార్థ్ జిందాల్‌తో కూడా సమావేశమవుతారు.

News January 20, 2026

ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

image

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.