News August 29, 2025
మా లక్ష్యం అదే.. జపాన్‌లో మోదీ

వచ్చే పదేళ్లలో భారత్‌లో 10 ట్రిలియన్ యెన్ (జపాన్ కరెన్సీ)ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని PM మోదీ పేర్కొన్నారు. జపాన్ PM షిగేరు ఇషిబాతో ఆర్థిక సదస్సు అనంతరం మోదీ మాట్లాడారు. జపాన్ కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని మోదీ చెప్పారు. సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, స్పేస్, గ్రీన్ ఎనర్జీ, హైస్పీడ్ రైలుపై పరస్పర సహకారం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.
Similar News
News August 29, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 5వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
News August 29, 2025
20 బంతులేసేందుకు 34,000 కి.మీ జర్నీ!

ది హండ్రెడ్ మెన్స్ లీగ్‌లో వరుసగా మూడోసారి ఓవల్ ఇన్విన్స్‌బుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో రాణించిన బౌలర్ రషీద్ ఖాన్ జాతీయ జట్టుకు ఆడేందుకు లీగ్‌ను వీడారు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను రీప్లేస్ చేసుకుంది. కాగా జంపా ఫైనల్లో 20 బంతులు వేసేందుకు ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్‌కు రానుపోను 34,000 కి.మీ ప్రయాణించనున్నారు. ఈ నెల 31న లార్డ్స్‌లో జరగబోయే ఫైనల్లో జంపా బరిలోకి దిగుతారు.
News August 29, 2025
విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రెకగ్నిషన్ తప్పనిసరి: సీఎం రేవంత్

TG: స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రెకగ్నిషన్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని CM రేవంత్ ఆదేశించారు. ‘మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్‌లో చేపట్టాలి. పాఠశాలల‌్లో క్రీడలకు ప్రాధాన్యమిచ్చి, అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో PETలను నియమించాలి. బాలికలకు వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాల’ని అధికారులకు సూచించారు.