News May 20, 2024
నాపై అతిపెద్ద ఆరోపణ అదే: మోదీ
తనకు 250 జతల దుస్తులున్నాయని గుజరాత్ మాజీ సీఎం అమర్ సిన్హ్ చౌదరీ చేసిన వ్యాఖ్యలే తనపై చేసిన అతిపెద్ద ఆరోపణలు అని ప్రధాని మోదీ అన్నారు. అమర్ సిన్హ్‌ను ఉద్దేశించి రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా.. తాను కావాలా అని కోరితే గుజరాత్ ప్రజలు తననే ఎంచుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత విపక్షాలు తనపై ఆరోపణలు చేసే ధైర్యం చేయలేదని పేర్కొన్నారు.
Similar News
News December 24, 2024
2024లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు
☛ ఐరా ఖాన్-నుపుర్ శిఖరే (JAN 3)
☛ తాప్సి-మథియాస్ బో (MARCH 23)
☛ సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ (JUNE 23)
☛ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ (JULY 12)
☛ సిద్ధార్థ్-అదితి రావు హైదరీ (SEP 16)
☛ అక్కినేని నాగచైతన్య-శోభిత (DEC 4)
☛ కీర్తి సురేశ్-ఆంటోనీ (DEC 12)
☛ పీవీ సింధు-వెంకట్ దత్తా (DEC 22)
News December 24, 2024
సీఎం రేవంత్ దావోస్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అక్కడ జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ టూర్‌కు వెళ్తారు.
News December 24, 2024
యశస్వీ జైస్వాల్ ఆ తప్పు చేస్తున్నారు: పుజారా
భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ క్రీజులో ఫాస్ట్‌గా ఆడాలని కంగారు పడుతున్నారని క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. తొలి 15 పరుగులు వేగంగా చేయాలనుకుని తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ వంటి దూకుడైన ఆటగాడు సైతం బంతి తన జోన్‌లో ఉన్నప్పుడే బలంగా బాదుతారు. కానీ జైస్వాల్ అనవసరమైన షాట్స్ ఆడుతున్నారు. బంతిని వద్దకు రానివ్వాలి. క్రీజులో ఎక్కువ సేపు నిలబడాలి’ అని సూచించారు.