News March 29, 2025
మా ఓటమికి అదే కారణం: రుతురాజ్

RCBతో మ్యాచులో తాము ఓడిపోవడానికి ఫీల్డింగ్ సరిగా చేయకపోవడమే కారణమని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు. ‘ఈ పిచ్‌పై 170 మంచి స్కోర్. RCB 20 రన్స్ అదనంగా చేసింది. మా ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచులు వదిలేశారు. పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు కొంచెం భిన్నంగా బ్యాటింగ్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే వికెట్లు కోల్పోయాం. కేవలం 50 రన్స్ తేడాతో ఓడాం. భారీ తేడాతో ఓడనందుకు సంతోషం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 31, 2025
SRHకు వేధింపులు.. సీఎం ఆగ్రహం

TG: పాసుల కోసం SRH యాజమాన్యాన్ని HCA <<15934651>>వేధింపులకు<<>> గురిచేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివరాలను సేకరించిన ఆయన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
News March 31, 2025
ఆ 400 ఎకరాలపై సర్వే జరగలేదు: హెచ్‌సీయూ

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని TGIIC <<15947111>>ప్రకటించడాన్ని<<>> హెచ్‌సీయూ ఖండించింది. 2024 జులైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, పరిశీలన మాత్రమే చేశారని పేర్కొంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని తెలిపింది. ఈ ప్రాంతంలోని పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వర్సిటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం ఉండాలంది.
News March 31, 2025
ఆయుధాలు పట్టండి.. మద్దతుదారులకు హమాస్ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా తమ మద్దతుదారులందరూ ఆయుధాల్ని చేపట్టాలని హమాస్ పిలుపునిచ్చింది. గాజాలో ఉన్న 20లక్షల పైచిలుకు ప్రజల్ని అక్కడి నుంచి బయటికి తరలించాలన్న ట్రంప్ ప్రణాళికను భగ్నం చేయాలని పేర్కొంది. ‘ఓ వైపు ఊచకోత, మరోవైపు ఆకలితో గాజా పౌరుల్ని చంపాలని ట్రంప్ ప్లాన్ వేస్తున్నారు. రాయి నుంచి బాంబు దాకా ఏదైనా చేతపట్టండి. ఈ కుట్రను అడ్డుకోండి’ అని స్పష్టం చేసింది.