News January 6, 2025

టీమ్ ఇండియా ఓటమికి కారణం అదే: గంగూలీ

image

BGT సిరీస్‌లో టీమ్ ఇండియా ఓటమికి బ్యాటింగ్‌లో వైఫల్యమే కారణమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేయడం చాలా ముఖ్యం. 170, 180 రన్స్ చేస్తే మ్యాచులు గెలవలేం. 350-400 పరుగులు చేయాలి. ఓటమి విషయంలో ఎవరినీ నిందించలేం. అందరూ రన్స్ చేయాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. BGTలో రోహిత్, కోహ్లీ బ్యాటింగ్‌పై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 30, 2026

NCERTలో 173 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>NCERT<<>>లో 173 గ్రూప్ A, B, C నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 2వరకు పొడిగించారు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News January 30, 2026

టమాటా రైతుల ఆవేదన.. కిలో రూపాయి కూడా లేదు!

image

AP: టమాటా ధరలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. 3నెలల క్రితం కిలో రూ.60 పలికిన టమాటాకి ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన నాణ్యమైన రకం ఇప్పుడు రూ.7 కూడా పడట్లేదని వాపోతున్నారు. మూడో రకమైతే రూపాయి కూడా రావట్లేదని చెబుతున్నారు. కోత కూలీ, ప్రయాణ ఖర్చులు కూడా రావట్లేదని కొందరు రైతులు పంటను వదిలేస్తున్నారు.

News January 30, 2026

కెనడా విమానాలపై ట్రంప్ టారిఫ్ బాంబ్‌

image

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50% టారిఫ్‌లు వేస్తానని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికన్ గల్ఫ్‌స్ట్రీమ్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వకపోవడమే కారణమని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా బొంబార్డియర్ సహా కెనడియన్ విమానాల సర్టిఫికేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల <<18949938>>కెనడాపై<<>> 100% సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించారు.