News April 7, 2024

ఆ వార్త ఫేక్: TDP

image

AP: కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ప్రకటించిందనే వార్త వైరల్ అవుతోంది. దీన్ని టీడీపీ ఖండిస్తూ ట్వీట్ చేసింది. ‘జగన్, నువ్వు ఎన్ని ఫేకులు చేసినా, పులివెందులలో కూడా నువ్వు ఓడిపోవడం ఖాయం. బాబాయ్ హత్యకు, కడప జిల్లా ప్రజలు నీకు బుద్ధి చెప్పడం ఖాయం’ అని పేర్కొంది.

Similar News

News February 5, 2026

పరుచూరి ‘వ్యక్తిత్వ వికాస’ మంత్రం ఇదే!

image

మనిషి వ్యక్తిత్వంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘మాట్లాడేటప్పుడు నోరు, ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉండాలి. ఇతరులను కలిసినప్పుడు ప్రవర్తన మర్యాదగా ఉండాలి. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో భయం లేకుండా ముందడుగు వేయాలి. మనిషి ఎదుగుదలకు క్రమశిక్షణ, సంస్కారం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

News February 5, 2026

బెన్ స్టోక్స్‌కు తీవ్రగాయం!

image

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. బాల్ తగలడంతో తన ముఖానికి గాయమైనట్లు ఇన్‌స్టాలో ఫొటోను షేర్ చేశారు. అందులో కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో “Get well soon” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News February 5, 2026

పచ్చి పాలతో గర్భిణికి ఇన్ఫెక్షన్.. శిశువు మృతి

image

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. గర్భిణీ సమయంలో ఓ మహిళ పచ్చి పాలను తాగేది. అందులోని బాక్టీరియా కారణంగా లిస్టీరియా అనే ఇన్ఫెక్షన్ సోకి నవజాత శిశువు మృతి చెందింది. అన్‌పాశ్చరైజ్డ్/ వేడి చేయని మిల్క్ తాగితే గర్భిణులు, శిశువులు, పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు గర్భస్రావం అవ్వొచ్చని అంటున్నారు. వేడి చేసిన పాలనే తాగాలని సూచిస్తున్నారు.