News March 26, 2025

ఆ ఒక్క సలహా విఘ్నేశ్‌ జీవితాన్ని మార్చేసింది!

image

ముంబై స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్‌ గురించి అతని స్నేహితుడు మహమ్మద్ షరీఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ‘విఘ్నేశ్ మొదట్లో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. లెగ్ స్పిన్‌కు మారి నైపుణ్యం సాధిస్తే మేలు చేస్తుందని సూచించా. నేను ఆఫ్ స్పిన్నర్ కాబట్టి అతనికి కొన్ని టెక్నిక్స్ నేర్పించా. పుతుర్ టాలెంట్ చూసి క్రికెట్ క్యాంపులకు వెళ్లమని చెప్పా. ఇద్దరం కలిసి 2-3 ఏళ్లు క్యాంపులకు వెళ్లాం’ అని తెలిపారు.

Similar News

News November 17, 2025

HYD: iBOMMA రవి అరెస్ట్‌పై సీపీ ప్రెస్‌మీట్

image

iBOMMA రవి అరెస్ట్‌పై నేడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ పోలీసులు బ్లాక్ చేశారు. ‘ఐబొమ్మ’ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్‌లు ప్రమోట్ చేసి రవి రూ.కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

News November 17, 2025

నువ్వుల పంట కోతకు వచ్చిందా?

image

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.

News November 17, 2025

ఏపీలో టంగ్‌స్టన్ తవ్వకాలు.. HZLకు లైసెన్స్

image

ఏపీలో టంగ్‌స్టన్ బ్లాక్‌లను కనుగొని తవ్వకాలు జరిపేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(HZL) సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు సంస్థ తెలిపింది. క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్ అన్వేషణలో దేశం స్వయంప్రతిపత్తి సాధించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడించింది. లైటింగ్ ఫిలమెంట్లు, రాకెట్ నాజిల్స్, ఎలక్ట్రోడ్లు, రేడియేషన్ షీల్డ్‌ల తయారీలో టంగ్‌స్టన్‌ను వాడతారు.