News November 4, 2024
ఆ ఫొటో ఫేక్.. నమ్మకండి: శివ కార్తికేయన్

బాడీ బిల్డింగ్‌పై నిజాలు ఒప్పుకునేందుకు కొందరు యాక్టర్లు వెనకాడుతుంటారు. ఎడిట్ ఫొటోలు వైరలయినా వాటిలో నిజమెంతుందో చెప్పేందుకు ఇష్టపడరు. కానీ, తమిళ హీరో శివ కార్తికేయన్ తన ఎడిటెడ్ ఫొటోపై స్పందించారు. అమరన్ మూవీ సెట్స్‌లోనిది అంటూ ఓ ఫొటో వైరల్ కాగా అది మార్ఫింగ్ చేసిందని వెల్లడించారు. తనకు సిక్స్ ప్యాక్ ఉన్నట్లు చాలా బాగా ఎడిట్ చేశారన్నారు. ఈ మూవీ కోసం తాను సిక్స్ ప్యాక్ ప్రయత్నించినట్లు తెలిపారు.
Similar News
News December 7, 2025
కొడాలి నాని గురించి ప్రశ్న.. వదిలిపెట్టనన్న లోకేశ్

AP: రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా డల్లాస్‌లో తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు కొడాలి నాని గురించి అడగ్గా ‘నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. మా అమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. చట్టపరంగా శిక్షిస్తాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
News December 7, 2025
అన్నింటికీ ఆధారం ‘విష్ణుమూర్తి’

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాది రచ్యుతః।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః॥
విష్ణుమూర్తికి పుట్టుక లేదు. ఆయనే అన్నింటికీ అధిపతి. ఏదైనా సాధించగలిగినవాడు. అన్నిటికంటే ముందుంటాడు. వానలు కురిపిస్తాడు. తిరిగి ఆ నీటిని స్వీకరిస్తాడు. ఆయన ఆత్మ అనంతం. కొలవడానికి వీలు కానిది. అన్ని లోకాల పరిణామం నుంచే ఈ సృష్టిని పుట్టించే శక్తి ఆయనకు ఉంది. అందుకే ఆయన అన్నింటికీ ఆధారం. <<-se>>#VISHNUSAHSARANAMAM<<>>
News December 7, 2025
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్‌ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.


