News June 15, 2024
‘విద్యాకానుక’పై ఆ ప్రచారం అవాస్తవం: AP ఫ్యాక్ట్ చెక్ వింగ్

AP: విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ అని ముద్రించిన బ్యాగులు, బెల్టులు పంపిణీ చేస్తున్నట్లు AP ఫ్యాక్ట్ చెక్ వింగ్ తెలిపింది. CM CBN ఆదేశానుసారం ఇవి పంపిణీ అవుతున్నాయని, కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని పేర్కొంది. విద్యార్థులకు పంపిణీ చేసే వస్తువులపై రాజకీయ చిహ్నాలు, ఫొటోలు ఉండకూడదని మార్చిలోనే కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారన్న ప్రచారం అవాస్తవమని తెలిపింది.
Similar News
News November 19, 2025
సిరిసిల్ల: అపెరల్ పార్కును సందర్శించిన ఇన్ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కును ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం సందర్శించారు. గ్రీన్ నీడిల్, టెక్స్పోర్ట్ పరిశ్రమలలో వస్త్ర తయారీ దశలను క్షుణ్ణంగా పరిశీలించారు. తయారైన వస్త్రాలను ఎక్కడికి ఎగుమతి చేస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి, వారి యోగక్షేమాలను, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆరా తీశారు.
News November 19, 2025
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు గిల్ దూరం!

SAతో తొలి టెస్టులో మెడనొప్పికి గురైన IND కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తొలి టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంతో ఘోర ఓటమి మూటగట్టుకున్న భారత్కు గిల్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. అతడి ప్లేస్లో BCCI సాయి సుదర్శన్ను తీసుకుంది. పంత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది.
News November 19, 2025
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

TG: చలి, పొగమంచు పెరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో HYD ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచనలు చేశారు. ‘నెమ్మదిగా నడుపుతూ అలర్ట్గా ఉండండి. మంచులో హైబీమ్ కాకుండా లోబీమ్ లైటింగ్ వాడండి. ఎదుటి వాహనాలకు సురక్షిత దూరాన్ని మెయిన్టైన్ చేయండి. సడెన్ బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతుంది. మొబైల్ వాడకుండా ఫోకస్డ్గా ఉండండి. వాహనం పూర్తి కండిషన్లోనే ఉందా అని చెక్ చేసుకోండి’ అని సూచించారు.


