News October 31, 2024
ఆ ఆస్తిని పేద పిల్లలకు పంచాలి: మంత్రి సత్యకుమార్

AP: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల సమస్యను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్ను తలపిస్తోందని ట్వీట్ చేశారు. ‘అక్రమంగా సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, కోట్లాది పిల్లలకు పంచాలి. అప్పుడే నిజమైన దీపావళి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
బిహార్ ఓటమి.. ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

బిహార్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఏడుగురు కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. క్రమశిక్షణ, పార్టీ సంస్థాగత సూత్రాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఆదిత్య పాశ్వాన్, షకీలుర్ రెహమాన్, రాజ్ కుమార్ శర్మ, రాజ్కుమార్ రాజన్, కుందన్ గుప్తా, కాంచన కుమారి, రవి గోల్డెన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ బిహార్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఉత్తర్వులిచ్చారు.
News November 25, 2025
మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధాన కాబోయే భర్త

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. 2 రోజుల క్రితం పలాశ్ ఎసిడిటీ, వైరల్ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో చేరి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని SVR ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పెళ్లి వేళ స్మృతి తండ్రి గుండెపోటుకు గురికావడంతో పలాశ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని ఆయన తల్లి అమిత తెలిపారు. 4 గంటలు ఏడ్చాడని వెల్లడించారు.
News November 25, 2025
ఈ నెల 30 వరకు వరుస సమావేశాలు

TG: గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తారని CMO తెలిపింది.
25 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై మీట్
26 : లాజిస్టిక్స్, సమ్మిట్ ఏర్పాట్లు
27 : మౌలిక వసతులు, అభివృద్ధి
28 : విద్య, యువజన సంక్షేమం
29 : వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం
30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం


