News April 5, 2024
ఉమేశ్ ఖాతాలో ఆ రికార్డు

గుజరాత్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డును సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. పంజాబ్‌పై ఉమేశ్ 34 వికెట్లు తీయడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో మోహిత్ శర్మ(MIపై 33 వికెట్లు), సునీల్ నరైన్(పంజాబ్‌పై 33 వికెట్లు), బ్రావో(MIపై 33 వికెట్లు), భువనేశ్వర్(KKRపై 32 వికెట్లు) ఉన్నారు.
Similar News
News February 14, 2026
వాలంటైన్స్ డే: మహీకాకు హార్దిక్ అదిరిపోయే గిఫ్ట్!

వాలంటైన్స్ డే సందర్భంగా హార్దిక్ పాండ్య తన కాబోయే భార్య మహీకా శర్మపై ఉన్న ప్రేమను చాటుతూ మెడపై ఒక ప్రత్యేకమైన టాటూ వేయించుకున్నారు. మొదట ‘M’ అనే అక్షరాన్ని మాత్రమే అనుకున్నా చివరికి రెండు చిరుతపులుల డిజైన్‌ను ఎంచుకున్నారు. ఒక చిరుత బలానికి చిహ్నంగా ఉంటే, రెండోది మహీకా అక్షరం ‘M’ రూపంలో ఆమె ఉనికిని సూచిస్తుంది. ఇద్దరూ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తమ రిలేషన్‌లో కలిసి ప్రయాణించాలన్నదే టాటూ అర్థం.
News February 14, 2026
గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే..

నేటి కాలంలో గుడ్ కొలెస్ట్రాల్ (HDL) తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతోంది. దీంతో గుండెపోటు ముప్పు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒమేగా-3 ఉండే చేపలు, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్‌నట్, బ్లూబెర్రీ, బీన్స్ తినాలని సూచిస్తున్నారు. షుగర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయాలి. స్మోకింగ్ మానేయాలి. రోజుకు 7-8 గం. నిద్రపోవాలి.
News February 14, 2026
పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.


