News March 17, 2025
ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే: సీఎం చంద్రబాబు

AP: 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల GDPకి చేరాలి. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత MLAలదే. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం’ అని తెలిపారు.
Similar News
News November 24, 2025
వరంగల్: డిసెంబర్ బియ్యం కోటా విడుదల

ఉమ్మడి జిల్లాలో రేషన్ షాపులకు సన్న బియ్యం అలాట్ అయ్యింది. HNK జిల్లాకు 4,789.54 మెట్రిక్ టన్నులు, జనగామ 3,548.47, భూపాలపల్లి 2,526.02, మహబూబాబాద్ 5,209.91, ములుగు 1,906.28, WGL 5,509.8 మెట్రిక్ టన్నులను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,10,124.53 మెట్రిక్ టన్నుల కోటాను డిసెంబరు కోసం విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలోనే ముందుగానే సన్నబియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నారు.
News November 24, 2025
PGIMERలో 151 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER)లో 151 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, MA/MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, STలకు రూ.800, PwBDలకు ఫీజు లేదు. డిసెంబర్ 6న పరీక్ష నిర్వహిస్తారు. https://pgimer.edu.in
News November 24, 2025
సినిమా అప్డేట్స్

* రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా DEC 12న జైలర్-2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
* ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ సాంగ్కు ఇన్స్టా, యూట్యూబ్లో 500K+ రీక్రియేషన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు.
* గోపీచంద్ మలినేని-బాలకృష్ణ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్.
* ప్రశాంత్ నీల్-జూ.ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు సమాచారం.


