News July 30, 2024
ఆ రూ.15 వేల కోట్లు అప్పే: జీవీఎల్

AP: అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్లు అప్పేనని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కానీ ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదని చెప్పారు. ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 2, 2026
కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.
News February 2, 2026
హైదరాబాద్‌లోని IIMRలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News February 2, 2026
పిండి దీపం ఎలా తయారుచేయాలి?

పావుశేరు బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టి, నీరు వడగట్టి నీడన ఆరబెట్టాలి. అనంతరం ఆ బియ్యాన్ని మెత్తని పిండిలా మిల్లులో పట్టించాలి. ఈ పిండిలో తగినంత బెల్లం తురుము, ఆవు నెయ్యి కలిపి ముద్దలా చేయాలి. ఈ ప్రక్రియ అంతా శుచిగా చేయాలి. ఆ ముద్దను ప్రమిద ఆకారంలో మలచి, మధ్యలో దీపం వెలిగించడానికి వీలుగా గుంటలా చేసి సిద్ధం చేయాలి. కుదిరితే ఆ దీపంపై గోవింద నామాలు దిద్దడం మరింత శ్రేయస్కరం.


