News August 9, 2025
పులివెందులలో గతంలో ఆ పరిస్థితి లేదు: ప్రత్తిపాటి

AP: ఎన్నికలు సజావుగా జరిగితే పులివెందులలో వైసీపీ గెలవదని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో గతంలో ఎప్పుడూ స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదని చెప్పారు. రౌడీ ముఠాలను తరిమేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కడప(D) ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలిపారు. ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Similar News
News August 10, 2025
21 సార్లు డకౌటయినా పర్లేదన్నారు: శాంసన్

భారత T20 కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ గురించి శాంసన్ ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఛాన్స్ ఇస్తానని సూర్య చెప్పాడు. అయితే 2 మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాను. నిరుత్సాహంలో ఉన్న నన్ను గంభీర్ భాయ్ చూసి ఏమైందని అడిగారు. ఛాన్స్ యూజ్ చేసుకోలేకపోతున్నానని చెప్పా. పర్లేదు.. 21 సార్లు డకౌట్ అయితే పక్కనపెడ్తానని అన్నారు. వారి ప్రోత్సాహమే నన్ను నడిపించింది’ అని వ్యాఖ్యానించారు.
News August 10, 2025
మరోసారి సాగర్ గేట్లు ఎత్తే అవకాశం!

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. శ్రీశైలం జలాశయం ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 43,999 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 309.35 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో పెరిగితే ఏ క్షణమైనా గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.
News August 10, 2025
రాఖీ పండుగ.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో

TG: నవ్వుతూ సోదరుడికి రాఖీ కట్టాల్సిన రోజు ఐదుగురు అక్కలు తమ్ముడికి కన్నీటితో తుది వీడ్కోలు పలికిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రానికి చెందిన యాకయ్య (50) అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఐదుగురు అక్కలు కంటతడి పెడుతూ తమ్ముడి ఇంటికి చేరుకున్నారు. ఆపై మృతదేహానికి చివరిసారి రాఖీ కట్టి విలపించారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.