News May 25, 2024
అది ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రశ్నలా ఉంది: ఖర్గే

కూటమి నుంచి PM అభ్యర్థి ఎవరనే బీజేపీ నేతల ప్రశ్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌లోని క్వశ్చన్‌లా ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే నేతలంతా కలిసి పీఎం ఎవరో నిర్ణయిస్తారని చెప్పారు. 2004-14లో అధికారంలో ఉన్న UPA ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని గుర్తు చేశారు. 2 కోట్ల ఉద్యోగాల పేరుతో BJP దేశ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.
Similar News
News December 31, 2025
WGL: మద్యం మత్తులో వాహనం నడిపితే కటకటాలకే!

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 85 మంది పట్టుబడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ట్రాఫిక్ విభాగంలో 42, సెంట్రల్ జోన్లో 20, వెస్ట్ జోన్లో 16, ఈస్ట్ జోన్లో 7 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి స్టీరింగ్ పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
News December 31, 2025
సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తన మూడో కూతురి పెళ్లి చేశాడు. తన సోదరుడి కుమారుడు అబ్దుల్ రహమాన్‌కు ఇచ్చి రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో DEC 26న వివాహం జరిపించాడని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ వేడుకకు పాక్ అధ్యక్షుడు, ప్రధాని, ISI చీఫ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా మునీర్‌కు నలుగురు కూతుళ్లు. అబ్దుల్ రహమాన్ ఆర్మీలో పని చేసి రిజర్వేషన్ కోటాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు.
News December 31, 2025
APPLY NOW: 102 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

<


