News March 29, 2024
ఆ టిప్పర్ డ్రైవర్ చంద్రబాబు కంటే ఎక్కువే చదివాడు: CM

AP: శింగనమల ఎమ్మెల్యే టికెట్ ఓ టిప్పర్ డ్రైవర్కు ఇచ్చామంటూ చంద్రబాబు తూలనాడాడని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘అవునయ్యా.. చంద్రబాబు. మేం పేదవాళ్లకు టికెట్లు ఇచ్చాం. ఆ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు MA ఎకనామిక్స్, ఆపై బీఈడీ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు రాక డ్రైవర్ అయ్యారు. మడకశిరలోనూ ఉపాధి హామీ కూలీ లక్కప్పకు టికెట్ ఇచ్చామని గర్వంగా చెప్తా’ అని అన్నారు.
Similar News
News January 31, 2026
గోల్డ్ ట్రేడింగ్.. నిమిషానికి రూ.5.33లక్షల కోట్లు ఆవిరి

చరిత్రలో తొలిసారి నిన్న గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ట్రేడింగ్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఈస్ట్రన్ టైమ్ ప్రకారం ఉ.9.30-10.25 గంటల మధ్య గోల్డ్ మార్కెట్ విలువ రూ.294 లక్షల కోట్ల మేర ఆవిరైనట్లు గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ల కామెంటరీ ప్లాట్ఫామ్ ది కొబెయిసీ లెటర్ తెలిపింది. అంటే నిమిషానికి రూ.5.33 లక్షల కోట్లు. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ గోల్డ్ ట్రేడింగ్ ఈ స్థాయిలో ఊగిసలాటకు లోనవ్వలేదని పేర్కొంది.
News January 31, 2026
ఉల్లితో చర్మానికి ఆరోగ్యం

ఇంట్లోని ఉల్లిపాయని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఉల్లిలోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. మచ్చలను తొలగిస్తాయి. ఉల్లిపాయ నుంచి తీసిన రసంలో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ముఖం మెరుస్తుంది. అంతేకాదు పిగ్మెంటేషన్ను కూడా ఉల్లిపాయ చక్కగా పోగొడుతుంది. శెనగపిండిలో ఉల్లిరసం, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం తేటగా అవుతుంది.
News January 31, 2026
నేడు శని త్రయోదశి! ఏం చేయాలంటే..?

శనిదోష నివారణకు ఎంతో అనుకూలమైన రోజు శని త్రయోదశి. అరుదైన ఈ పుణ్యకాలంలో చేసే పూజలకు అధిక శక్తి ఉంటుంది. నేడు పాటించే కొన్ని పరిహారాలు దోష విముక్తి కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు. శనైశ్చరుడుకి తైలాభిషేకం చేయాలంటున్నారు. నల్ల నువ్వులు, వస్త్రాలు దానం చేయడం, కాకులు, శునకాలకు ఆహారం పెట్టడం వల్ల విశేష ఫలితాలుంటాయని సూచిస్తున్నారు. ఈ పుణ్య దినాన పాటించాల్సిన నియమాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


