News October 21, 2024

ఆ విష‌పూరిత నురుగు అంత‌రిక్షం నుంచీ కనిపిస్తోంది

image

ఢిల్లీకి ప్ర‌ధాన నీటి వ‌న‌రైన‌ య‌మునా న‌ది క‌లుషిత స్థాయుల‌ను చెప్పేందుకు ఈ ఒక్క చిత్రం స‌రిపోతుందేమో. ఏటా న‌వంబ‌ర్‌లో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్య‌ర్థాల ద‌హ‌నం స‌హా పండుగ‌ల సీజ‌న్‌లో న‌గ‌రంలో గాలి, నీటి కాలుష్యం భారీగా పెరుగుతుంది. ప‌రిశ్ర‌మల ర‌సాయ‌నాలు, కాలువల వ్య‌ర్థాలతో న‌ది ప్ర‌ధాన బ్యారేజ్‌ల వ‌ద్ద విష‌పూరిత నురుగు ద‌ర్శ‌న‌మిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్‌లో కూడా అది కనిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Similar News

News November 2, 2025

మహేశ్‌ని అలా ఎప్పుడూ అడగలేదు: సుధీర్ బాబు

image

తన సినిమాల్లో హిట్లున్నా, ఫ్లాపులున్నా పూర్తి బాధ్యత తనదేనని హీరో సుధీర్ బాబు ‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘కృష్ణకు అల్లుడు, మహేశ్‌కు బావలా ఉండటం గర్వకారణం, ఓ బాధ్యత. కృష్ణానగర్‌లో కష్టాలు నాకు తెలియదు. కానీ, ఫిల్మ్‌నగర్‌ కష్టాలు నాకు తెలుసు. నాకో పాత్రగానీ, సినిమాగానీ రికమెండ్ చేయమని నేను మహేశ్‌ను ఎప్పుడూ అడగలేదు’ అని తెలిపారు. జటాధర మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News November 2, 2025

ధ్వజస్తంభాన్ని ఎలా తయారుచేస్తారు?

image

ధ్వజస్తంభాన్ని పలాస, రావి, మారేడు వంటి పవిత్ర వృక్షాల కలపతో తయారుచేసి, ఇత్తడి లేదా బంగారు తొడుగు వేస్తారు. దీని కింద వైష్ణవాలయాల్లో సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నాలు ఉంటాయి. దీనికి జీవధ్వజం అనే పేరు కూడా ఉంది. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధ్వజస్తంభం పవిత్రత, శక్తిని కలిగి ఉండటానికి నిత్య అనుష్ఠానాల వల్ల భగవంతుని చూపు దీనిపై పడుతుంది.

News November 2, 2025

నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

image

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.