News March 7, 2025
ఆ వీడియో నాదే.. కానీ అందులోని..: గోరంట్ల మాధవ్

అత్యాచార బాధితురాలి పేరు బయటకు చెప్పిన వీడియో తనదే కానీ, ఆ వాయిస్ కాదని గోరంట్ల మాధవ్ పోలీసులకు చెప్పారు. గురువారం విచారణకు హాజరైన మాజీ ఎంపీ ఆ బాధితురాలి పేరు తనకు తెలియదని తెలిపారు. కాగా పోక్సో కేసులో బాధితురాలి పేరు బయటకు చెప్పొద్దన్న నిబంధనను ఓ కేసులో మాధవ్ ఉల్లంఘించారని మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు.
Similar News
News November 22, 2025
వారం రోజులు కన్నాల రైల్వే గేటు మూసివేత

పాలకుర్తి మండలం కన్నాల రైల్వే గేటును వారం రోజులు మూసివేస్తున్నట్టు శనివారం రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచి 29 వరకు కన్నాల లెవెల్ క్రాసింగ్ 46 వద్ద 3వ రైల్వే ట్రాక్ బేస్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నందున గేట్ క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కావున ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ దారిని ఎంచుకుని రైల్వే శాఖకు సహకరించాలని కోరారు.
News November 22, 2025
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.
News November 22, 2025
తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2


