News June 25, 2024
అది కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం: TMC

లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీ చేయడం కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయమని TMC ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. దీనిపై కాంగ్రెస్ తమను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్‌కు TMC మద్దతు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభలో రాహుల్, అభిషేక్ మాట్లాడుకున్న ఫొటో నెట్టింట వైరలైంది. దీంతో స్పీకర్ ఎన్నికలో సహకరించాలని TMCని రాహుల్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
Similar News
News November 28, 2025
స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్‌లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్‌లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్‌ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.
News November 28, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులు వీరే

TG: హైదరాబాద్‌లో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు దేశవిదేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, ఆనంద్ మహీంద్రా, UAE రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ అంతర్జాతీయ, టెక్ కంపెనీల CEOలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లూ రానున్నారు.
News November 28, 2025
సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్‌గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.


