News February 2, 2025
90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే: సచిన్

విలువలు పాటించే విషయంలో తనకు తన కుటుంబం ఎంతో మద్దతునిచ్చిందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. నమన్ అవార్డ్స్ ఈవెంట్లో మాట్లాడుతూ ’90వ దశకం మధ్యలో రెండేళ్లు నేను బ్యాట్ కాంట్రాక్టు లేకుండా ఆడాను. ఆ సమయంలో ఆల్కహాల్, టొబాకో కంపెనీలు తమ ప్రచారం కోసం బ్యాట్లను మాధ్యమంగా వాడుకున్నాయి. అందుకే వాటిని ప్రోత్సహించొద్దని మా ఇంట్లో డిసైడ్ అయ్యాం. 90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే’ అని వెల్లడించారు.
Similar News
News November 20, 2025
తిరుపతి: డిగ్రీ విద్యార్థులకు గమనిక

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించారు. ఈ మేరకు SVU కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫీజు తుది గడువు 18వ తేదీతో ముగియగా.. ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
News November 20, 2025
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు: సజ్జనార్

TG: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.
News November 20, 2025
BSNL.. రూ.2,399కే ఏడాదంతా..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నట్లు పేర్కొంది. రూ.2,399తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. కాగా జియో, ఎయిర్టెల్ ఏడాది ప్లాన్స్ రూ.3,500కు పైగానే ఉన్నాయి. అయితే BSNL నెట్వర్క్ మెరుగుపడాలని, అది సరిగా లేకుంటే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా లాభం లేదని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.


