News September 10, 2024
అదే నేను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా: టొవినో

తాను తెలుగులో చూసిన తొలి సినిమా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అని మలయాళ హీరో టొవినో థామస్ తెలిపారు. ఆయన హీరోగా నటించిన A.R.M మూవీ తెలుగు ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడారు. ‘నేను పదో క్లాసులో ఉన్నప్పటి నుంచీ అల్లు అర్జున్ సినిమాలను చూస్తున్నా. 2021 డిసెంబరులో RRR ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్‌ను తొలిసారి కలిశా. వారంతా చాలా మంచి వ్యక్తులు. ఇక ప్రభాస్ నచ్చనివాళ్లు ఎవరుంటారు?’ అని కొనియాడారు.
Similar News
News November 13, 2025
ఆత్మకూరులో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 13, 2025
భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.
News November 13, 2025
నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఉమర్‌కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.


