News September 23, 2024
అది నా జీవితంలో హైలైట్.. థాంక్యూ మెగాస్టార్: హరీశ్ శంకర్

తన డైరెక్షన్లో ఓ యాడ్ షూట్లో నటించిన మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు హరీశ్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘2 వారాలుగా జ్వరంతో బాధపడుతున్నా. నా జీవితంలో హైలైట్ను ఎట్టకేలకు ఇప్పుడు పంచుకుంటున్నా. కేవలం ప్రకటన కోసమే అయినా ఈ అనుభవం అద్భుతం. సెట్లో ప్రతి క్షణం ఓ మ్యాజిక్. ఆ రోజును నా జీవితాంతం మర్చిపోను. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ బాస్’ అని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా జీతం చెల్లింపుపై RINL సర్క్యులర్

విశాఖ స్టీల్ ప్లాంట్, RINL సర్క్యులర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఉద్యోగుల జీతం ఇకపై సాధించిన ఉత్పత్తి లక్ష్యాల శాతానికి అనుగుణంగా చెల్లించబడుతుంది. గతంలో లక్ష్యాలు చేరుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 8 గంటల పాటు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు, సంస్థ నిబంధనల ప్రకారం పూర్తి జీతం ఇవ్వాలని కార్మిక సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నూతన విధానం అమలుపై ప్లాంట్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
News November 16, 2025
ఫర్నిచర్ కొనేటప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు

ఆఫర్ ఉందనో, డిజైన్ నచ్చిందనో తొందరపడి ఫర్నిచర్ కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు. నిజంగా మీకు ఆ వస్తువు అవసరం ఉందో, లేదో.. ఆలోచించండి. తక్కువ ధరకు దొరుకుతుందని నాణ్యతను పట్టించుకోకపోతే నష్టపోతారు. నాణ్యతే ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలి. ట్రెండ్ను ఫాలో అవుతూ కొనుగోలు చేయొద్దు. అది ఎప్పుటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి.. చూడటానికి ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవడం మంచిది.
News November 16, 2025
3Dలోనూ అఖండ-2

బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.


