News February 25, 2025
అది ఇండియాకు అడ్వాంటేజ్: కమిన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో అన్నిమ్యాచ్‌లు ఆడుతుండటం జట్టుకు అడ్వాంటేజ్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కమిన్స్ అన్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా బలంగా ఉందని, ఈ అంశం వారికి మరింత కలిసి వస్తోందని కమిన్స్ తెలిపారు. కాగా గాయం కారణంగా కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.
Similar News
News February 25, 2025
గోల్కొండ, చార్మినార్‌కు టూరిస్టుల ఓటు

TG: దేశంలో అత్యధిక మంది సందర్శించిన చారిత్రక ప్రదేశాల్లో గోల్కొండ 6, చార్మినార్ 9వ స్థానాల్లో నిలిచాయి. 2022-24కు గానూ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో టాప్-3లో తాజ్ మహల్, కోణార్క్‌లోని సూర్య దేవాలయం, ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఉన్నాయి. ఇక 2019 తర్వాత హైదరాబాద్‌కు సందర్శకుల తాకిడి 30 శాతం పెరిగినట్లు సర్వే వెల్లడించింది.
News February 25, 2025
టాయిలెట్‌కు మొబైల్ తీసుకెళ్తున్నారా?

టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్లి గంటల కొద్దీ మాట్లాడటం, రీల్స్ చూడటం కొందరికి అలవాటుగా మారింది. అయితే కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల నొప్పితో కూడిన ఇన్‌ఫ్లమేషన్, మొలలు, తీవ్ర కేసుల్లో యానల్ ఫిస్టులాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. చిరుతిళ్లు ఎక్కువగా తినడం, సరిపడిన నీరు తాగకపోవడమూ దీనికి కారణమవుతున్నట్లు పేర్కొంటున్నారు.
News February 25, 2025
స్వయం ఉపాధికి రాయితీ రుణాల మంజూరు

AP: క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలకు రుణ రాయితీ కింద రూ.2.43కోట్లను విడుదల చేసినట్లు మంత్రి NMD ఫరూక్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ కార్పొరేషన్ ద్వారా రూ.4.86కోట్ల స్వయం ఉపాధి ప్రణాళిక అమలుకు నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగానే రూ.2.43కోట్లు రాయితీ కింద ఇస్తుండగా, మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ రూపంలో పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు.