News May 11, 2024
అటు ఐకాన్ స్టార్.. ఇటు గ్లోబల్ స్టార్
ఏపీ ఎన్నికల్లో ‘మెగా ఫ్యామిలీ’ మార్క్ కనిపిస్తోంది. ప్రచారానికి చివరిరోజు కావడంతో ఇవాళ పవన్ కళ్యాణ్‌కు మద్దతిచ్చేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. మరోవైపు తన ఫ్రెండ్ శిల్పా రవి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల చేరుకున్నారు. అయితే మొన్న పవన్‌కు సప్పోర్ట్‌గా ట్వీట్ చేసిన బన్నీ.. ఈ రోజు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతివ్వడం గమనార్హం.
Similar News
News December 28, 2024
నేడు కడపకు పవన్.. ఎంపీడీవోకు పరామర్శ
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అన్నమయ్య(D) గాలివీడు MPDO జవహర్ బాబును పరామర్శిస్తారు. అనంతరం గాలివీడులోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శిస్తారు. దాడి జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంటారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 28, 2024
మన్మోహన్ స్మారకార్థం స్థలం కేటాయించిన కేంద్రం
మన్మోహన్ సింగ్ <<14998092>>అంత్యక్రియలపై వివాదం<<>> రాజుకున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అమిత్ షా దీనిపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.
News December 28, 2024
రేపు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
TG: సిద్దిపేట(D) కొమురవెల్లిలోని ప్రఖ్యాత మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుక రేపు ఉ.10.45 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవదాయ శాఖ పూర్తి చేసింది. ఈ కళ్యాణంతో బ్రహ్మోత్సవాలకు కూడా అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి మార్చి 24 వరకు నిర్వహించే జాతరకు AP, TGలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వస్తారు.