News November 2, 2024
అది మీకు మూడే ఛాప్టర్ లోకేశ్: వైసీపీ
AP: త్వరలోనే రెడ్‌బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని మంత్రి లోకేశ్ చేసిన <<14502154>>హెచ్చరికలపై<<>> వైసీపీ Xలో సెటైర్లు వేసింది. ‘మూడో ఛాప్టర్ కాదు నిక్కర్ మంత్రి.. అది మీకు మూడే ఛాప్టర్. అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. మీ MLAలు, అనుచరులు పోలీసులను బానిసలుగా చూడటాన్ని పట్టించుకోలేదనుకుంటున్నారా? మీ అన్ని ఛాప్టర్లు క్లోజ్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది గుర్తుంచుకోండి’ అని పేర్కొంది.
Similar News
News November 2, 2024
నేడు ‘రుషికొండ’కు సీఎం చంద్రబాబు
AP: ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ విశాఖలోని రుషికొండ భవనాలను పరిశీలించనున్నారు. గత ప్రభుత్వం రూ.500 కోట్లతో నిర్మించిన వీటిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ భవనాలను నిర్మించడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
News November 2, 2024
జూన్ కల్లా రేవంత్‌ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి
TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.
News November 2, 2024
మళ్లీ అల్పపీడనం.. 7 నుంచి భారీ వర్షాలు
AP: వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.