News May 13, 2024
అది కచ్చితంగా ఔటే: సంగక్కర
నిన్న CSKvsRR మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఫీల్డర్ త్రోకు అడ్డు రావడంతో అంపైర్ ఔట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. SRHతో మ్యాచ్‌లోనూ జడ్డూ ఇదే తరహాలో అడ్డు రాగా ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నారు. కానీ ఈసారి తాము చేసింది కరెక్టేనని RR కోచ్ సంగక్కర స్పష్టం చేశారు. జడ్డూ వెనక్కి సరాసరి పరిగెత్తకుండా బంతికి అడ్డువచ్చేందుకు యత్నించారని, అందువల్ల అతడి ఔట్ సరైనదేనని తేల్చిచెప్పారు.
Similar News
News January 9, 2025
సీఎం ఆదేశాలు.. తిరుపతికి బయల్దేరిన ముగ్గురు మంత్రులు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులు తిరుపతికి బయల్దేరారు. అక్కడి పరిస్థితులను వారు దగ్గరుండి సమీక్షించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అటు రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు.
News January 9, 2025
జనవరి 09: చరిత్రలో ఈరోజు
* 1915: మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చిన రోజు
* 1922: ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు, నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా జననం
* 1934: బాలీవుడ్ సింగర్ మహేంద్ర కపూర్ జననం
* 1965: సినీ డైరెక్టర్, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పుట్టినరోజు
* 1969: తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభం
* ప్రవాస భారతీయుల దినోత్సవం
News January 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.