News January 11, 2025
నేను హిందీ నేర్చుకుంది అలానే: మోదీ
జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందీ సరిగ్గా రాదని ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని నిఖిల్ కామత్ అనగా, మోదీ తన మాతృభాష కూడా హిందీ కాదని అన్నారు. తన బాల్యంలో రైల్వే స్టేషన్లో చాయ్ చుట్టూ హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండేవారని.. వారితో మాట్లాడుతూ భాష నేర్చుకున్నానని మోదీ వ్యాఖ్యానించారు.
Similar News
News January 11, 2025
AAP vs BJP: ఢిల్లీ రాజకీయాల్లో సెగ పుట్టించిన CAG రిపోర్ట్!
ఎన్నికల వేళ విడుదలైన CAG రిపోర్టు ఢిల్లీ రాజకీయాల్లో సెగ పుట్టించింది. అరవింద్ కేజ్రీవాల్ కొత్త లిక్కర్ పాలసీతో GOVTకు రూ.2026కోట్ల నష్టమొచ్చిందని చెప్పడం AAPను ఆత్మరక్షణలో పడేసింది. పాలసీ ఉద్దేశమే బాగాలేదని, నిపుణుల అభిప్రాయాలను పట్టించుకోలేదని, కంపెనీల సామర్థ్యం లెక్కలోకి తీసుకోలేదని, ఉల్లంఘనలకు శిక్షించలేదని, ధరల్లో పారదర్శకత లేదని, అమలకు ముందు అసెంబ్లీ ఆమోదం తీసుకోలేదని రిపోర్టు పేర్కొంది.
News January 11, 2025
90 గంటల LT సుబ్రహ్మణ్యన్ వార్షిక వేతనం రూ.51కోట్లు
‘ఉద్యోగులు ఆదివారం సహా వారానికి 90 గంటలు పనిచేయాలి’, ‘మీ భార్యను ఎంత సేపు చూస్తారు’ అంటూ కామెంట్ చేసిన LT ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ శాలరీ తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! 2023-24లో ఆయన ఏడాది వేతనం ₹51CR. బేస్ శాలరీ ₹3.6CR, ప్రీరిక్విసైట్స్ ₹1.67CR, కమిషన్ ₹35.28CR, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ₹10.5CR తీసుకున్నారు. LTలో ఉద్యోగి సగటు శాలరీ ₹9.55 లక్షలతో పోలిస్తే ఆయన శాలరీ 534 రెట్లు ఎక్కువన్నమాట.
News January 11, 2025
మూవీ కలెక్షన్స్.. గ్రాస్, నెట్ మధ్య తేడా ఇదే!
సినిమా కలెక్షన్లను గ్రాస్, నెట్, షేర్ అని ప్రకటిస్తుంటారు. మూడు పెద్ద సినిమాల విడుదల ఉండటంతో మరోసారి వాటి గురించి తెలుసుకుందాం. థియేటర్లలో టికెట్ సేల్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ గ్రాస్. అందులో ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ పోగా మిగిలేది నెట్. వీటిలో ఎగ్జిబిటర్లు, థియేటర్స్ పర్సంటేజ్ కట్ అయ్యాక ఫైనల్గా నిర్మాతకు దక్కేది షేర్ కింద లెక్కిస్తారు. ఇలా రూ.250 టికెట్లో నిర్మాతకు రూ.100 వస్తుంది.