News April 14, 2024
నా పెళ్లి అలా జరగాలి: జాన్వీకపూర్

తన పెళ్లి తిరుమలలో సంప్రదాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ‘నా పెళ్లిలో నేను కాంచీపురం పట్టుచీర ధరించి.. మల్లెపూలు పెట్టుకోవాలని ఉంది. కాబోయే భర్త కూడా పంచె కట్టుకోవాలి. అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం పెట్టాలి. నాకు కొంచెం సిగ్గు కాబట్టి కొంతమందిని మాత్రమే ఆహ్వానిస్తా. ఎక్కువమంది వస్తే నన్నే చూస్తుంటారు. దీంతో నాకు ఇబ్బందిగా ఉంటుంది’ అని ఆమె చెప్పారు.
Similar News
News April 9, 2026
YSR మరణం.. జగన్‌పై అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్

AP: YSR చనిపోవడానికి ముందే జగన్ CM పదవి కోసం సంతకాలు తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏంటని సందేహాలు వ్యక్తం చేశారు. ‘2019లో తండ్రి చావును సింపతీగా చూపి పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మలేదు. CBN గెలుస్తారని సర్వేలు చెప్పాయి. దీంతో సొంత బాబాయిని అడ్డంగా నరికిన విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు’ అని అన్నారు.
News April 9, 2026
సొంత ఇల్లు, కారు లేవు.. దేశంలోనే పేద సీఎం మమత!

తనకు సొంత ఇల్లు, కారు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. 9.8 గ్రాముల బంగారం, రూ.75,700 నగదు ఉందని తెలిపారు. మొత్తంగా రూ.15.37 లక్షల ఆస్తులు ఉన్నట్లు ప్రస్తావించారు. దీంతో దేశంలో పేద సీఎంగా మమత నిలిచారు. ఆమె తర్వాతి స్థానాల్లో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(రూ.55 లక్షలు), కేరళం సీఎం పినరయి విజయన్(రూ.కోటి) ఉన్నారు.
News April 9, 2026
దాహమేస్తోందని అడగలేవు.. మనమే దప్పిక తీరుద్దాం!

ఎండాకాలంలో జంతువులు నీడ, నీరు లేక అల్లాడిపోతాయి. దాహమేస్తోందని అడగలేవు కూడా. అందుకే వాటి బాధను మనం అర్థం చేసుకుందాం. ఇందుకోసం మీరు చేయాల్సింది ఇంటి ముందర చిన్న తొట్టె లేదా బకెట్లో నీళ్లు నింపి పెట్టడమే. మండే ఎండల్లో దాహంతో ఉన్న పక్షులు, జంతువులు ఆ నీటితో కడుపు నింపుకుంటాయి.
Share It


