News February 26, 2025
నా నిజమైన ఫస్ట్ లవ్ అదే: సమంత

అనారోగ్యంతో కొద్దికాలంగా స్క్రీన్పై తక్కువగా కనిపిస్తున్న సమంత త్వరలో బిజీగా మారనున్నట్లు చెప్పారు. ఒకట్రెండు నెలల్లో చాలా వర్క్ మొదలు కానుందని, షూటింగ్లతో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు. సినిమాలే తన నిజమైన ఫస్ట్ లవ్ అని, ఇక వాటికి దూరంగా ఉండనన్నారు. సమంత ‘రక్త బ్రహ్మాండ్’ సిరీస్తో పాటు ఓ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, తొలిసారి నిర్మాతగా మారి ‘బంగారం’ అనే మూవీ నిర్మించనున్నారు.
Similar News
News December 13, 2025
మహిళలూ ఈ తప్పులు చేస్తున్నారా?

మహిళలు చేసే కొన్ని తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాదీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి HPV ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు గర్భధారణలో చేసే తప్పులు కూడా దీనికి కారణమంటున్నారు.
News December 13, 2025
HILTP: భూ బదిలీకి ఒక్క దరఖాస్తూ రాలేదు

TG: హిల్ట్ (HILT) విధానం కింద పారిశ్రామిక భూముల బదిలీ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TSIIDC)కు ఇంకా ఎలాంటి దరఖాస్తులూ అందలేదు. తెలంగాణలో 21 పారిశ్రామికవాడలు ఉన్నాయి. HILTను NOV 22న ప్రకటించారు. దీని కింద భూముల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే యాజమాన్యాలతో ప్రభుత్వం భేటీ కానుంది.
News December 13, 2025
పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.


