News August 11, 2024

ధోనీ విషయంలో అది పెద్ద ప్రశ్న: అశ్విన్

image

IPLలో ధోనీని CSK రిటెన్షన్ చేసుకునే అంశంపై ఆ టీమ్ మాజీ ప్లేయర్, ప్రస్తుత RR ఆటగాడు అశ్విన్ స్పందించారు. ‘ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడనున్నాడా అన్నది పెద్ద ప్రశ్న. అతడు కొన్నేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. కాబట్టి ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పేర్కొనడం కరెక్టే. కానీ ధోనీ లాంటి ఆటగాడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా అన్నది మరో చర్చ’ అని తన యూట్యూట్ ఛానల్‌లో అశ్విన్ అభిప్రాయపడ్డారు.

Similar News

News November 15, 2025

భూకంపాలను పసిగట్టే ప్రాచీన భారత టెక్నాలజీ

image

భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి సవాలే. కానీ, వేల ఏళ్ల క్రితమే మన భారతీయ శాస్త్రాలు భూకంపాల పూర్వ సూచనలను చెప్పే గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాయి. సుమారు 1,500 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత అనే గ్రంథంలో, భూకంపాలకు ముందు ప్రకృతిలో వచ్చే అసాధారణ వాతావరణ మార్పులను (పశుపక్ష్యాదుల ప్రవర్తన, భూగర్భ జలాల్లో మార్పులు) క్షుణ్ణంగా వివరించారు. <<-se>>#VedikVibes<<>>

News November 15, 2025

CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు: రాష్ట్ర ప్రభుత్వం

image

AP: సీఐఐ సదస్సులో తొలి రోజు 365 సంస్థలతో రూ.8,26,668 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మిట్ ముందు రోజుతో కలిపి 400 MoUలు, రూ.11,99,971 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. దీంతో 13,32,445 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసిందని తెలిపింది.

News November 15, 2025

కలియుగ ధర్మ సూత్రమిదే..

image

ఈ కలియుగంలో నీ గతం ఎంత గొప్పదైనా నీవు చేసిన ఒక్క తప్పును జనం చెడుగానే పరిగణిస్తారు. వంద మంచి పనులు చేసినా, ఒక చిన్న లోపం కనిపిస్తే, లోకం నిన్ను చెడ్డవానిగా ముద్రవేస్తుంది. అదేవిధంగా నీ గతం ఎంత చెడ్డదైనా, చిత్తశుద్ధితో చేసిన ఒక్క మంచి పని అయినా నిన్ను మంచివానిగా నిలబెట్టగలదు. అందుకే జనాభా అభిప్రాయాలకు లొంగకుండా, వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవిత నిబంధనగా ముందుకు సాగాలి.