News July 9, 2024
అథ్లెట్లు చేసే అతి పెద్ద తప్పు అదే: బింద్రా

ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో షూటింగ్ దిగ్గజం అభివన్ బింద్రా భారత క్రీడాకారులకు కీలక సూచనలు చేశారు. ‘మేం ఆడుతున్నప్పుడు పరిస్థితులు వేరు. కానీ నేటి తరం అథ్లెట్లు పిరికివాళ్లు కాదు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. అయితే, సాధారణంగా అథ్లెట్లు చేసే పెద్ద తప్పు గతం, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడమే. ఆడుతున్నప్పుడు ప్రస్తుతాన్నే వారు దృష్టిలో పెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.