News March 26, 2025

మా ఓటమికి అదే కారణం: గిల్

image

PBKSతో <<15888318>>మ్యాచులో<<>> తమకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని GT కెప్టెన్ గిల్ అన్నారు. ‘బౌలింగ్‌లో చాలా పరుగులు ఇచ్చేశాం. ఫీల్డింగ్‌లోనూ తప్పులు చేశాం. ఛేజింగ్‌లో తొలి 3 ఓవర్లలో, ఇన్నింగ్స్ మధ్యలో మరో 3 ఓవర్లలో ఎక్కువ రన్స్ చేయకపోవడం వల్లే ఓడాం. పంజాబ్ బౌలర్ వైశాక్ యార్కర్లతో అద్భుతంగా బౌలింగ్ చేశారు. 15 ఓవర్ల తర్వాత ఇంపాక్ట్‌గా వచ్చి అలా బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.