News September 26, 2024

నేను రిటైర్ అవడానికి కారణం అదే: శిఖర్ ధవన్

image

క్రికెట్ ఆడాలన్న ఆసక్తి లేకపోవడం వల్లే తాను రిటైరయ్యానని భారత మాజీ బ్యాటర్ శిఖర్ ధవన్ తెలిపారు. ‘రెండేళ్ల నుంచి నాకు పెద్దగా క్రికెట్ అవకాశాల్లేవు. ఐపీఎల్ మాత్రమే ఆడాను. దేశవాళీ క్రికెట్ అసలు ఆడాలనిపించలేదు. ఆటపై ఆసక్తి తగ్గిపోయిందని అర్థమై తప్పుకొన్నా. నా కెరీర్లో సాధించిన దాని పట్ల సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉన్నా’ అని వివరించారు. భారత్‌ తరఫున ధవన్ 34 టెస్టులు, 167 ODI, 68 T20I మ్యాచులు ఆడారు.

Similar News

News January 19, 2026

వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

image

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.

News January 19, 2026

‘ధురంధర్’ విలన్ రోల్.. నో చెప్పిన నాగార్జున!

image

రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ మూవీలో విలన్ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునను సంప్రదించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే పాత్ర నచ్చినా అప్పటికే కూలీ, కుబేర సినిమాల్లో నటిస్తుండటంతో డేట్స్‌ను అడ్జస్ట్ చేయలేక నాగ్ ఆఫర్‌ను తిరస్కరించారని పేర్కొన్నాయి. దీంతో చివరకు అక్షయ్ ఖన్నాను సెలక్ట్ చేశారని వెల్లడించాయి.

News January 19, 2026

థైరాయిడ్ పేషంట్లకు ఈ ఆహారం మంచిది

image

థైరాయిడ్ హార్మోన్ సవ్యంగా విడుదలైనప్పుడే జీవక్రియలు బాగుంటాయి. దీంట్లో హెచ్చుతగ్గులను సరిచేయడానికి మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అయోడిన్ ఉన్న ఉప్పు వాడటంతో పాటు చిక్కుళ్లు, బటానీలు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి విటమిన్ C ఉండే ఫ్రూట్స్, ఫిష్, ఓట్స్, రాగిజావ, మిల్లెట్స్ తినాలని సూచిస్తున్నారు. ✍️ థైరాయిడ్ గురించి మరింత సమాచారం కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.