News January 4, 2025
చిరు పాత్ర గురించి చెప్పేది అప్పుడే: అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవితో తాను తెరకెక్కించే సినిమాలో క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చిరును శ్రీకాంత్ ఓదెల ఒకలా చూపిస్తే నేను ఇంకోలా చూపిస్తాను. ఫైనల్‌గా ఆడియన్స్‌ను మెప్పించడమే లక్ష్యం. ప్రస్తుతం స్టోరీ లైన్ ఓకే అయింది కానీ స్క్రిప్ట్ పని జరుగుతోంది. అది పూర్తయ్యాకే ఆయన పాత్ర చిత్రణ గురించి చెబుతాను’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 6, 2025
మహా కుంభమేళా.. ఈ రోజుల్లో పవిత్ర స్నానాలు
మహా కుంభమేళా జరిగే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తారు. ముఖ్యంగా పుష్య పూర్ణిమ(JAN 13), మకర సంక్రాంతి(JAN 14), మౌని అమావాస్య(JAN 29), వసంత పంచమి(FEB 3), మాఘ పూర్ణిమ(FEB 12), మహా శివరాత్రి(FEB 26) రోజులు పవిత్రమైనని. ఆ సమయాల్లో స్నానాలు చేస్తే చంద్రుడు, ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని, ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్ఫలితాలు ఉంటాయని నమ్మకం.
News January 6, 2025
వాలంటీర్లు ఉద్యోగాల్లోనే లేరు: లోకేశ్
AP: పుట్టని పిల్లలకు పేరెలా పెడతామని గ్రామ, వార్డు వాలంటీర్లపై ఎదురైన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. ‘వాలంటీర్లపై GOను జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదు? వాళ్లు ఉద్యోగాల్లోనే లేరు. ఎన్నికలప్పుడు 80% మందితో జగన్ రిజైన్ చేయించారు. వాళ్లు ఇప్పుడు లేరు కదా? అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులిచ్చారు. అది చట్టానికి విరుద్ధం. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది’ అని లోకేశ్ అన్నారు.
News January 6, 2025
ఇంగ్లండ్‌తో వన్డేలు ఆడనున్న రోహిత్, కోహ్లీ!
రోహిత్, కోహ్లీ వచ్చే నెల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డేలు ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత వీరు రెస్ట్ తీసుకుంటారని వార్తలు రాగా, ఈ సిరీస్ ఆడితే FEB 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించేందుకు కలిసొస్తుందని వీరు భావిస్తున్నట్లు సమాచారం. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా నేరుగా CT ఆడతారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. FEB 6, 9, 12 తేదీల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.