News January 28, 2025

అప్పుడే మా ప్రభుత్వ విజయం: శ్రీధర్ బాబు

image

TG: దావోస్ సదస్సులో భారీ ఎత్తున పెట్టుబడులు రావడం ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గతేడాది కంటే 4 రెట్లు ఎక్కువగా ఒప్పందాలు జరిగాయని మీడియా సమావేశంలో తెలిపారు. ప్రత్యక్షంగా 49,500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వన్ ట్రిలియన్ ఎకానమీ దిశగా గొప్ప అడుగు పడిందన్నారు. ఒప్పందం జరిగినంత మాత్రాన విజయం సాధించినట్టు కాదని, కంపెనీలన్నీ స్థాపించినప్పుడే విజయమని తెలిపారు.

Similar News

News January 10, 2026

చిట్లిన కురులను ఇలా సరిచేద్దాం..

image

మారిన జీవనశైలి వల్ల చాలామంది అనేక జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో జుట్టు చివర్లు చిట్లి గడ్డిలా కనిపిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొబ్బరినూనెలో కొద్దిగా రోజ్‌మేరీ ఆయిల్, ఆముదం కలిపి రాయాలని చెబుతున్నారు నిపుణులు. వీటిలో ఉండే వివిధ రకాల పోషకాలు జుట్టుకి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తాయి. అలాగే అరటిపండ్లు, తేనె, పెరుగు ఎక్కువగా తింటే జుట్టు రాలడం తగ్గుతుందంటున్నారు.

News January 10, 2026

WPL: ఇవాళ డబుల్ ధమాకా

image

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. టోర్నీలో 5 జట్లే పాల్గొంటుండటంతో టీమ్‌లు వరుస రోజుల్లో మ్యాచులు ఆడే పరిస్థితి ఏర్పడింది. నిన్న తొలి మ్యాచులో RCB చేతిలో <<18814463>>ఓడిన<<>> ముంబై ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచులో గుజరాత్-యూపీ వారియర్స్ తలపడతాయి. హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News January 10, 2026

త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు

image

TG: నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. గ్రూప్స్ ద్వారా ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాగా ఇటీవల జాబ్ క్యాలెండర్ కోరుతూ విద్యార్థులు <<18794438>>ఆందోళన<<>> చేపట్టిన విషయం తెలిసిందే.