News January 8, 2025

అందుకే బీర్ల ధరలు పెంచలేదు: మంత్రి జూపల్లి

image

TG: యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్‌లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.

Similar News

News January 9, 2025

మోహన్ బాబుకు స్వల్ప ఊరట

image

సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

News January 9, 2025

బాలకృష్ణలో అలాంటి అహం లేదు: హీరోయిన్

image

ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నా బిగ్ స్టార్‌ని అనే అహం బాలకృష్ణలో లేదని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటారని చెప్పారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరికీ గౌరవం ఇస్తారని పేర్కొన్నారు. ‘డాకు మహారాజ్’ సినిమాలో తన పాత్ర సాఫ్ట్‌గా ఉంటుందన్నారు. ఈ రోల్‌తో ప్రేక్షకులకు మరింత చేరువవుతానని తెలిపారు. ఈ మూవీ ఈ నెల 12న రిలీజ్ కానుంది.

News January 9, 2025

రాష్ట్రంలో ఇక KF బీర్లు దొరకవా?

image

TG: ప్రభుత్వం రేట్లు పెంచడం లేదంటూ యునైటెడ్ బ్రూవరీస్(UB) సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. KF సహా 7 రకాల బీర్లు తయారుచేసే ఈ సంస్థకు సంబంధించి ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ ఉందని మంత్రి జూపల్లి తెలిపారు. కొన్నిరోజుల పాటు KF బీర్లు వైన్స్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అప్పటిలోపు ప్రభుత్వం, UB కంపెనీ మధ్య సయోధ్య కుదిరితే KF బీర్ల సరఫరాకు ఆటంకం ఉండదు. లేదంటే ఇకపై రాష్ట్రంలో ఆ రకం బీర్లు లభించవు.