News July 4, 2024

భోలేబాబాను అందుకే అరెస్ట్ చేయలేదు: పోలీసులు

image

తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాను ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి UP పోలీసులు చెప్పిన సమాధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘సేవాదార్ వేద్ ప్రకాశ్ మధుకర్ పేరిట సత్సంగ్ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు. అందుకే నిర్వహణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేశాం. భోలేబాబాను కూడా విచారిస్తాం. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియడంలేదు’ అని తెలిపారు. బాబా వెనకాల రాజకీయ శక్తులుండటంతోనే ఆయనను అరెస్ట్ చేయడంలేదని ఆరోపణలొస్తున్నాయి.

Similar News

News March 15, 2026

Viral: రూ.60వేలతో రూ.25 కోట్లు!

image

ఆదిలాబాద్‌లో 1990ల్లో కొన్న భూమి కనక వర్షం కురిపించిందని ఓ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఆదిలాబాద్‌లో మా అంకుల్ ఎకరానికి రూ.15వేల చొప్పున 4 ఎకరాలు కొన్నారు. అంటే రూ.60వేలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ పట్టణం అభివృద్ధి చెందింది. డీమార్ట్ రూ.25 కోట్లు ఇచ్చి 2 ఎకరాలను కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా నెలకు వడ్డీ కింద రూ.14.5 లక్షలు వస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.

News March 15, 2026

మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు: వైసీపీ

image

AP: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన <<19386182>>డ్రగ్స్ పార్టీలో<<>> టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారని వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ డ్రగ్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోందని మండిపడింది. ‘మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు హోంమంత్రి’ అంటూ అనిత, చంద్రబాబు, పవన్, లోకేశ్‌ను ట్యాగ్ చేసింది.

News March 15, 2026

నెతన్యాహును వేటాడి మరీ చంపేస్తాం: IRGC

image

నెతన్యాహు మరణించలేదంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఒకవేళ ఆయన బతికే ఉంటే వేటాడి మరీ చంపేస్తామని IRGC హెచ్చరించింది. మరోవైపు నెతన్యాహు చేతికి ఆరువేళ్లు ఉన్నాయని.. అది <<19382555>>AI వీడియో<<>> అని ఇరాన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది AI వీడియో కాదని, లైటింగ్ వల్ల ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడి అలా ఒక వేలు ఎక్స్‌ట్రా ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.