News August 26, 2024

బీజేపీకి ఎంపీ సీట్లు అందుకే తగ్గాయి: పురందీశ్వరి

image

ఇండియా కూటమి దుష్ప్రచారం చేయడం వల్లే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గాయని ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురందీశ్వరి అన్నారు. ‘బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, చర్చిలు, మసీదుల్ని కూల్చివేస్తారని, రిజర్వేషన్లు తీసివేస్తారని అసత్య ప్రచారం చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే పార్టీ బీజేపీ. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News April 3, 2026

ఫుడ్ రేట్లు పెంచారు సరే.. మళ్లీ తగ్గిస్తారా?

image

సరిపడా వంటగ్యాస్ సిలిండర్లు దొరకట్లేదని, బ్లాక్‌లో అధిక ధరకు కొంటున్నామని చాలా హోటళ్లు ఫుడ్ రేట్లను పెంచేశాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే గ్యాస్ సంక్షోభం తీరిపోతే పెంచిన ధరలను తగ్గిస్తారా? అని సామాన్యులకు సందేహం వస్తోంది. గతంలో కరోనా సమయంలో రేట్లను పెంచారు. ఆ మహమ్మారి వదిలి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అవే ధరలను కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో? COMMENT?

News April 3, 2026

రాజధానిపై వైసీపీకి క్లారిటీ లేదా?

image

AP: రాజధానిపై YS జగన్, ఆ పార్టీ ముఖ్య నేతల స్టేట్‌మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ‘మావిగన్’ను రాజధాని చేయాలని జగన్ అంటుంటే.. తాము అమరావతికి వ్యతిరేకం కాదని వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర ఎంపీలు చెబుతున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదని, అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో రాజధానిపై వైసీపీకి క్లారిటీ ఉందా? లేదా? అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

News April 3, 2026

ఐశ్వర్యరాయ్‌తో విడాకుల పుకార్లు.. అభిషేక్ ఏమన్నారంటే?

image

విడాకుల పుకార్లను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమను ఇన్నాళ్లు కలిపి ఉంచిందని అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఐశ్వర్యా రాయ్‌తో 18 ఏళ్ల వైవాహిక బంధం వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన పంచుకున్నారు. తమ వైవాహిక జీవితం నిలబడటానికి ‘తీవ్రమైన అహం’ కారణమని అభిషేక్ చెప్పారు. అయితే ఇక్కడ ‘అహం’(Ego) అంటే గర్వం కాదని, బంధాన్ని కాపాడుకోవాలనే పట్టుదల &ఆత్మగౌరవం అని వివరించారు.