News September 5, 2025
అందుకే VRO, VRAలను BRS తొలగించింది: CM రేవంత్

TG: ధరణి పేరిట ధన, భూదాహంతో BRS ప్రభుత్వం భూములన్నీ చెరబట్టిందని CM రేవంత్ విమర్శించారు. తమ దుర్మార్గాలు ప్రజలకు తెలియకూడదనే VRO, VRAలను తొలగించారన్నారు. ఎన్నికల ముందు ఎవరిని కదిలించినా ధరణి గురించే చెప్పేవారని, అందుకే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామన్న హామీని నెరవేర్చినట్లు చెప్పారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగిస్తున్నామని GPO నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు.
Similar News
News September 6, 2025
కాళేశ్వరంపై ప్రధానిని కలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

TG: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ వేగవంతం చేసేందుకు సీఎంతో కలిసి ప్రధానిని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బీజేపీ అగ్రనేతలు కూడా విమర్శించారని గుర్తుచేశారు. సీబీఐ విచారణకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.
News September 5, 2025
ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

సినిమా టికెట్లకు విధించే GSTపై ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేశారు. ‘జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నా. 5 శాతం జీఎస్టీని రూ.100 టికెట్లలోపు కాకుండా రూ.250 టికెట్లకు పెడితే మరింత మేలు జరుగుతుంది. ఇది మధ్య తరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఎంతో సహకరిస్తుంది’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రూ.100 టికెట్లపై 12 శాతం GSTని తొలగించి 5 శాతం జీఎస్టీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
News September 5, 2025
రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటాం: నిర్మల

దేశ అవసరాలకు తగ్గట్టు రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. చమురును ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే నిర్ణయం మనదే అని వివరించారు. అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఎగుమతిదారులకు ఉపశమనం కలిగేలా త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు.