News December 15, 2024

అందుకే చంద్రబాబును 420 అంటారు: జగన్

image

AP: విజన్-2047 పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ చీఫ్ జగన్ Xలో దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో చేపట్టిన పథకాలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. గత పాలనలో ప్రకటించిన విజన్లు ప్రచార ఆర్భాటంగానే మిగిలాయన్నారు. సంపద సృష్టిస్తానంటూ ప్రభుత్వ ఆస్తులను ఆవిరి చేశారని, అందుకే చంద్రబాబును 420 అంటారని పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

ADB: పల్లె నుంచే గడ్డెన్న ప్రస్థానం..!

image

ముధోల్ నియోజకవర్గం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే పేరు గడ్డెన్న. భైంసా మండలం దేగం సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం 6 సార్లు ఎమ్మెల్యే ఓసారి మంత్రి వరకు కొనసాగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజం. అందుకే ఆయనంటే పల్లె ప్రజల్లో ఓ గౌరవం. గడ్డెన్న తన బిడ్డలను నేరుగా పెద్ద పదవులు కట్టబెట్టవచ్చు కానీ అలా చేయలేదు. కొడుకు విఠల్ రెడ్డిని సర్పంచ్‌గా పోటీ చేయించి, క్రమంగా శాసనసభ వరకు తీసుకెళ్లారు.

News December 4, 2025

179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://cau.ac.in/

News December 4, 2025

దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

image

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.