News March 27, 2024
ధోనీ అందుకే బ్యాటింగ్‌కు రాలేదు: హస్సీ
IPL-2024లో ఇప్పటివరకు CSK ఆడిన 2 మ్యాచుల్లో ధోనీ బ్యాటింగ్‌కు రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆయన ఒక్క బాల్ కూడా ఆడలేదు. దీనిపై బ్యాటింగ్ కోచ్ హస్సీ స్పందిస్తూ ‘ఇంపాక్ట్ రూల్ వల్ల బ్యాటింగ్ ఆర్డర్ లెంగ్త్ ఎక్కువైంది. అందుకే ధోనీ 8వ స్థానంలో రావాల్సి వస్తోంది. మరోవైపు ఫాస్ట్‌గా ఆడాలని బ్యాటర్లకు హెడ్ కోచ్ ఫ్లెమింగ్ సూచించారు. అందుకే ధోనీ బ్యాటింగ్‌కు రాలేదు. ఆయన మంచి ఫామ్‌లో ఉన్నారు’ అని వివరించారు.
Similar News
News November 5, 2024
రాష్ట్రంలో ఘోరం.. మహిళపై గ్యాంగ్ రేప్
TG: HYD మధురానగర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ(50)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కూలీ చేసుకునే సదరు మహిళ కొండాపూర్‌లో పని ముగించుకుని నిన్న రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్‌లో బంధించారు. అనంతరం నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
News November 5, 2024
Wikiకి కేంద్రం నోటీసులు
అసత్య, పక్షపాత సమాచార అభియోగాలపై వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీని పబ్లిషర్‌గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్‌ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీ గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్‌తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. ANI బీజేపీ అనుకూల మీడియా అని పేర్కొనగా, సదరు సంస్థ కోర్టుకెక్కడంతో దీనిపై వివాదం మొదలైంది.
News November 5, 2024
దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
AP: ఓ విలేకరి హత్య కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తుని నియోజకవర్గం తొండంగికి చెందిన విలేకరి సత్యనారాయణ 2019 అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు. దీనికి సూత్రధారి దాడిశెట్టి రాజా అని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రాజా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.