News April 20, 2024

అందుకే ధోనీ లేటుగా వస్తున్నారు: ఫ్లెమింగ్

image

CSK ఆటగాడు ధోనీ ఆఖరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చారు. ‘గత ఏడాది ధోనీ మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దానికి సంబంధించిన నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. తనను చూసేందుకే స్టేడియానికి వచ్చే ఫ్యాన్స్‌ను నిరాశపరచకూడదనే చివర్లోనైనా బ్యాటింగ్‌కి వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి ఆయనకు లభించే ప్రేమ అద్భుతం’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News January 30, 2026

ఫామ్‌హౌస్‌లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

image

TG: హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న 3PMకు విచారణకు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో విచారణ చేసేందుకు <<19005122>>నిరాకరించడానికి<<>> గల కారణాలను వివరించారు. తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందని తెలిపారు. విచారణను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను, రికార్డులను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు.

News January 30, 2026

గ్రూప్-1 ఫలితాలు విడుదల

image

AP: గ్రూప్-1 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన వారి జాబితాను <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచింది. 2023 DECలో 87 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ రాగా 2024 MARలో ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్, జూన్‌లో ఇంటర్వ్యూలు జరిగిన విషయం తెలిసిందే. పలు కారణాలతో ఫలితాల విడుదల ఆలస్యమైంది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో రిజల్ట్స్ విడుదలయ్యాయి.

News January 30, 2026

చిరంజీవి సినిమా అరుదైన రికార్డు

image

చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ మూడో వారంలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోందని తెలిపారు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.360+ కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.