News August 18, 2025

తిరుమలకు ఫ్రీ బస్సు సౌకర్యం అందుకే పెట్టలేదు: మంత్రి

image

తిరుపతి నుంచి <<17428145>>తిరుమలకు<<>> వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేయకపోవడానికి గల కారణాలను మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ‘తిరుమలకు ఫ్రీ బస్ పెడితే జనం ఎక్కువగా ఎక్కుతారు. కొండపై ఎక్కువ మందితో బస్సులు నడవడం ప్రమాదకరం. ఘాట్ రోడ్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్లాలి. లేదంటే బస్సులు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కొండపైకి వెళ్లాక అక్కడ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంది’ అని గుర్తుచేశారు.

Similar News

News August 18, 2025

రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోన్ చేశారు: మోదీ

image

రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తనకు ఫోన్ చేశారని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవల అలస్కాలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీలో చర్చించిన అంశాల గురించి తనకు వివరించారని PM ట్వీట్ చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం జరిగే ప్రయత్నాలన్నింటికీ భారతదేశ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పుతిన్‌తో మరిన్ని సంభాషణలు జరిపేందుకు ఎదురుచూస్తున్నామన్నారు.

News August 18, 2025

లిక్కర్ స్కాం కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్

image

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సహా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇదే కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లనూ కొట్టేసింది.

News August 18, 2025

రాజధాని పరిధిలో ₹904 కోట్లతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

image

AP: రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ₹904 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ‘రోడ్ల నిర్మాణానికి ₹339Cr కేటాయిస్తున్నాం. పనులకు త్వరలో టెండర్లు పిలుస్తాం. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. భూసేకరణలో “అసైన్” పదాన్ని తీసేయాలని నిర్ణయించాం. రాజధానిలో ₹411Crతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మిస్తాం’ అని చెప్పారు.