News September 30, 2024

అందుకే T20లకు రిటైర్మెంట్ ప్రకటించా: రోహిత్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్-2024 గెలిచాక ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనకున్న కారణాలను ఆయన తాజాగా వెల్లడించారు. ‘నేను 17 ఏళ్లు ఈ ఫార్మాట్‌ను ఆస్వాదించా. వరల్డ్ కప్​ గెలవడంతో ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అనిపించింది. టీమ్ఇండియాలో గొప్ప ప్లేయర్లున్నారు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు.

Similar News

News December 8, 2025

భారత్‌కు గుడ్‌న్యూస్.. గిల్ ఎంట్రీ పక్కా!

image

మెడ నొప్పి వల్ల SAతో టెస్టులు, వన్డేలకు దూరమైన గిల్ T20లతో తిరిగి జట్టులో చేరేందుకు రెడీ అయ్యారు. రేపట్నుంచి SAతో 5మ్యాచుల T20 సిరీస్ ప్రారంభం కానుండగా ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకున్నారు. BCCI CoEలో గిల్ ఫిట్‌నెస్ సాధించినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. విశాఖలో చివరి వన్డే తర్వాత గంభీర్ కూడా దీన్ని ధ్రువీకరించగా గిల్ ఎంట్రీ పక్కా కానుంది. హార్దిక్ సైతం రీఎంట్రీ ఇస్తుండటంతో జట్టు బలం పెరిగింది.

News December 8, 2025

పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

image

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

News December 8, 2025

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా, తాజాగా 18వ తేదీ వరకు గడువు పెంచింది. అలాగే ఫైన్ లేకుండా ఈ నెల 9వ తేదీ వరకు, రూ.50 ఫైన్‌తో 12 వరకు, రూ.200 ఫైన్‌తో ఈ నెల 15 వరకు, రూ.500 ఫైన్‌తో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.