News July 2, 2024

అందుకే పిచ్‌పై మట్టి తిన్నా: రోహిత్

image

T20WC గెలిచిన అనంతరం బార్బడోస్ పిచ్‌‌ మీద <<13536415>>మట్టి <<>>తినడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్‌శర్మ వెల్లడించారు. ‘ఆ పిచ్‌పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నా’ అని రోహిత్ తెలిపారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో SAపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.

Similar News

News October 30, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

image

తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం తగ్గలేదు. దీంతో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News October 30, 2025

నేడు ఈ చెట్టు కింద భోజనం చేస్తే..

image

నేడు కార్తీక శుద్ధ నవమి. విష్ణువు కూష్మాండుడు అనే రాక్షసుడిని ఇదే రోజు సంహరించాడని పురాణాల వాక్కు. అందుకే కూష్మాండ నవమి అని కూడా అంటారు. ఈ రోజున లక్ష్మీనారాయణులను ఉసిరి చెట్టు వద్ద ఆవాహన చేసి పూజిస్తారు. ఉసిరి చెట్టు కింద జగద్ధాత్రి పూజ చేసి, విష్ణు సహస్ర నామం, కనకధారా స్తోత్రం వంటివి పఠించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. దీని వలన కీర్తి, జ్ఞానం, సంపదలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.

News October 30, 2025

CSIR-IICTలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో 7 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in/