News July 31, 2024
అందుకే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చా: రేవంత్

TG: చీల్చి చెండాడుతా అన్నవారు సభకు రావడం లేదని మాజీ CM కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సెటైర్లు వేశారు. ఆయన చీల్చి చెండాడుతారని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి వచ్చానని CM ఎద్దేవా చేశారు. ‘మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని మొసలి కన్నీరు కారుస్తున్నారు. తొలి ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మైనారిటీలు, మహిళలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News November 20, 2025
ఓటమి తర్వాత తేజస్వీ యాదవ్ ఫస్ట్ రియాక్షన్

కొత్త ప్రభుత్వం బిహార్ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు RJD నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి తర్వాత తొలిసారి ఆయన స్పందించారు. ‘సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ గారికి, కొత్తగా మంత్రులైన సభ్యులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
News November 20, 2025
దేవ్జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు.. HCకి తెలిపిన పోలీసులు

AP: టాప్ మావోలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలన్న పిటిషన్లపై పోలీసులు HCలో వివరణ ఇచ్చారు. వారిద్దరూ తమ వద్ద లేరన్నారు. దీంతో వారు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్లను HC ఆదేశించింది. మావో కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారన్న పోలీసుల ప్రెస్ స్టేట్మెంట్ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో విచారణను HC రేపటికి వాయిదా వేసింది.
News November 20, 2025
చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు ఎక్కువగా వాడతారు. కానీ దాని క్లీనింగ్పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి 5 నిమిషాలు నిమ్మ చెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.


