News May 9, 2024
అందుకే నాకు హిందీ ఆఫర్లు రాలేదు: జ్యోతిక
తాను సౌత్ ఇండియన్ అనుకుని హిందీ ఫిల్మ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వలేదని నటి జ్యోతిక తెలిపారు. బాలీవుడ్‌లోనే కెరీర్ ప్రారంభించినా ఆఫర్లు రాలేదన్నారు. అటు సౌత్‌లో కొన్ని మూవీలు ఫ్లాపైనా నటనను మెచ్చి ఇక్కడ ఛాన్సులు ఇచ్చారని చెప్పారు. ముంబైకి చెందిన జ్యోతిక తొలి మూవీ ‘డోలీ సజా రఖ్‌నా’ (1998). 2024లో ‘సైతాన్’తో బ్లాక్‌బస్టర్ బీటౌన్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె లేటెస్ట్ మూవీ ‘శ్రీకాంత్’ ఈనెల 10న రిలీజ్ కానుంది.
Similar News
News December 25, 2024
కుటుంబ సభ్యులతో YS జగన్(PHOTO)
AP: YS జగన్ కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని YSR ఎస్టేట్‌లో తన బంధువులు, కుటుంబ సభ్యులతో జగన్ సరదాగా ఓ ఫొటో దిగారు. ఇందులో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సోదరులు YS అనిల్, సునీల్, అవినాశ్ రెడ్డి, కుమార్తెలు వర్ష, హర్ష సహా తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి.
News December 24, 2024
మణిపుర్‌కు కొత్త గవర్నర్.. కేంద్రం వ్యూహం ఇదేనా?
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లాను నియమించింది. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన్ను అనూహ్యంగా తెరమీదకు తేవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాంతి భద్రతల అంశాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్న కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
News December 24, 2024
జనవరి 1న శ్రీశైలం వెళ్తున్నారా?
AP: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో జనవరి 1న స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. న్యూఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఉదయాస్తమాన, ప్రాతఃకాల, ప్రదోషకాల సేవలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులందరికీ స్వామి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని వెల్లడించారు.