News March 12, 2025
అందుకే శృంగార సీన్లలో నటించట్లేదు: కరీనా

సినిమాల్లో కథను నడిపించేందుకు శృంగార సన్నివేశాలు అవసరం లేదని కరీనా కపూర్ అన్నారు. అందుకే తాను అలాంటి సీన్లలో నటించట్లేదని, పైగా ఆ సన్నివేశాలతో తనకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ‘పశ్చిమ దేశాలతో పోల్చితే INDలో ఇలాంటి సన్నివేశాలను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు అలాంటి వాటికి సిద్ధంగా లేరు. దానిని హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్‌లాగా చూడరు’ అని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.
News March 9, 2026
నెతన్యాహుతో మాట్లాడే డిసైడ్ చేస్తా: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆపాలనేది ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అది సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, సరైన సమయంలో డెసిషన్ తీసుకుంటామన్నారు. తాము దాడి చేయకపోతే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అంతం చేసి ఉండేదన్నారు. కాగా ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ యుద్ధం పదో రోజుకి చేరింది. మరోవైపు సౌదీపై దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
News March 9, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.


