News August 6, 2025
అందుకే ‘వార్ 2’ మూవీ చేశా: Jr.NTR

నటనలో తనను తాను సవాల్ చేసుకొనే పాత్రలో నటించాలన్న ఉద్దేశంతోనే వార్2కు ఒప్పుకున్నానని ఎన్టీఆర్ అన్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఈ చిత్రం కోసం సౌత్, నార్త్ నుంచి అందరు టెక్నీషియన్స్ కలిసి పనిచేశారు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనేవి లేవు. అందరూ ఇండియన్ మూవీ ఇండస్ట్రీగా కలిసి పనిచేయాలి. బలమైన కథ కావడం కూడా నేను వార్ 2 చిత్రం ఒప్పుకోవడానికి కారణం’ అని తెలిపారు.
Similar News
News August 7, 2025
IPL.. కెప్టెన్ మాతోనే ఉంటారు: RR

IPLలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడి CSK లేదా KKRలోకి వెళ్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండించిన RR యాజమాన్యం సంజూను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అతడు తమ జట్టుకు ముఖ్యమైన, తిరుగులేని కెప్టెన్ అని చెప్పింది. సంజూతో పాటు మరే ఆటగాడిని ట్రేడ్ చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని RR వెల్లడించింది.
News August 7, 2025
ఇవాళ 3 పథకాలు ప్రారంభం

AP: చేనేత కార్మికుల కోసం 3 పథకాలను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందించే స్కీంను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో CM చంద్రబాబు ప్రారంభిస్తారు. చేనేత దుస్తులపై 5% GST మినహాయింపు, చేనేతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌పై CM ప్రకటించనున్నారు. ప్రభుత్వం సుమారు 2.5 లక్షల చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
News August 7, 2025
రూ.18 లక్షల జీతంతో ఉద్యోగాలు.. పెళ్లి కానివారు అర్హులు

ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ 379 టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. బీటెక్ పూర్తైన లేదా చివరి ఏడాది చదువుతున్న 20-27 ఏళ్లలోపు పెళ్లికాని వారు అర్హులు. ఎంపికైతే ట్రైనింగ్‌లో ₹56,100 స్టైఫండ్ ఉంటుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుని ఏడాదికి రూ.18 లక్షలు(నెలకు ₹1.5లక్షలు) జీతం ఇస్తారు. పదేళ్లు విధుల్లో ఉండొచ్చు. అవసరమైతే పొడిగిస్తారు. లేదంటే తప్పుకోవాలి. AUG 22 చివరి తేదీ. వివరాలకు <