News April 2, 2025

అందుకే గోవాకు మారుతున్నా: జైస్వాల్

image

తాను ముంబై టీమ్ నుంచి <<15967764>>గోవా జట్టుకు మారడంపై<<>> యశస్వీ జైస్వాల్ స్పష్టతనిచ్చారు. గోవా క్రికెట్ అసోసియేషన్ తనకు లీడర్‌షిప్ రోల్ ఆఫర్ చేసిందని, అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలిపారు. ఇది చాలా కష్టతరమైన నిర్ణయమని, తన ఎదుగుదలకు కారణమైన ముంబై సిటీ, MCAకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టీమ్ ఇండియా తరఫున రాణించడం, గోవా జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు.

Similar News

News December 1, 2025

TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

image

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.

News December 1, 2025

వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

image

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.